ADDITIONAL EO REVIEWS PROGRESS OF BIOGAS PLANT WORKS AND SOLID WASTER CLEARANCE AT TIRUMALA _ తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో సమీక్ష
Tirumala, 05 December 2025: The TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary held a review meeting with TTD officials and representatives of IOCL at the Meeting hall of Padmavathi Rest House, Tirumala on Friday to assess the progress of the Biogas Plant pbeing set up by IOCL at the Tirumala dumping yard.
He also reviewed on the Solid Waste clearance mechanism in detail with the officials.
During the meeting, the Additional EO instructed the Engineering and Health officials of TTD to extend full cooperation to IOCL and ensure that the Biogas Plant is completed swiftly and commissioned by January 2026.
He directed the officials to complete the pipeline works at the earliest and take immediate measures to provide the required permanent power connection to the plant.
The TTD Chief Engineer Sri Satyanarayana, Executive Engineer Water Works Sri Sudhakar, Health DyEO Sri Somanarayana, participated.
From IOCL, Executive Director Sri Piyush Mittal and DGM (CSR) Sri Kailash Kanth partcipated virtually while the CGM (Engineering) Sri Elamaran, Divisional Head Sri Jayanth Kumar, Engineering In-charge Sri Swaroop and others also took part.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2025 డిసెంబర్ 05: తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘన వ్యర్థాలను తొలగించడం పై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు.
పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్పర్ మెషిన్లను ఏర్పాటు చేయాలన్నారు.
టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్న ప్రసాద కేంద్రంలోని కిచెన్ కు బయో గ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో అంగీకారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ తరఫున సిఈ శ్రీ సత్యనారాయణ, ఈఈ వాటర్ వర్క్స్ శ్రీ సుధాకర్, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఐఓసీఎల్ ఈడీ శ్రీ పియూష్ మిట్టల్ (వర్చువల్), ఇంజినీరింగ్ సీజీఎం శ్రీ ఎలమరన్, సీఎస్ఆర్ డీజీఎం శ్రీ కైలాష్ కాంత్(వర్చువల్), డివిజనల్ హెడ్ శ్రీ జయంత్ కుమార్, ఇంజినీరింగ్ ఇన్ ఛార్జ్ శ్రీ స్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




