BHOOMI PUJA FOR BIO – GAS PLANT PERFORMED AT TIRUMALA _ తిరుమలలో బయో గ్యాస్ ప్లాంటుకు భూమి పూజ

Tirumala, 06 November 2024: A 40 tonne capacity IOCL Bio gas plant will be installed at Tirumala jointly by IOCL and TTD to which Bhoomi Puja was performed by the Additional EO Sri Ch Venkaiah Chowdary on Wednesday.

The plant is being set up in over 2.22 acres with a compost storage unit over 0.17 acres to generate 40 tonnes of gas daily.

In the plant costing ₹12.85 crores, TTD will invest ₹5.80 cores out of ₹7.05 cores while the remaining by IOCL.

On completion of the project, biogas generated from the mixed wastes every day shall be supplied through a 2.5 km long pipeline to the Matrusri Tarigonda Vengamamba Anna Prasadam complex (MTVAC).

TTD CE Sri Satyanarayana, DyEO Health Smt Ashajyoti, IOCL ED& SH Sri Anil Kumar, CGMs Sri YV Ramana Rao, Sri MRV Badrinath and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో బయో గ్యాస్ ప్లాంటుకు భూమి పూజ

తిరుమల, 2024 నవంబరు 06: ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి తిరుమలలోని కాకులమాను తిప్ప వద్ద బుధవారం ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి భూమిపూజ చేశారు.

2.22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును ఐఓసీఎల్ నిర్మించనుంది. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని రూ.12.85 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించగా రూ.7.05 కోట్లు ఐఓసీఎల్, రూ.5.80 కోట్ల నిధులను టీటీడీ సమకూర్చనుంది.

ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయో గ్యాస్ ను ఉత్పత్తి చేసి రెండున్నర కిలో మీటర్ల దూరంలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైపు లైన్ ద్వారా పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఐఓసీఎల్ ఈడీ&ఎస్ హెచ్ శ్రీ బి.అనిల్ కుమార్, సిజిఎంలు శ్రీ వై.వి.రమణరావు, శ్రీ ఏం.ఆర్.వి.బద్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.