TTD EO MEETING WITH L&T ON SECURITY REVAMP _ తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్&టీ సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో సమావేశం

Tirumala, 11 July 2025: Keeping in mind the future needs in the larger interests of the safety and security of the multitude of devotees visiting Tirumala, TTD EO Sri J. Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary held a meeting with the L&T  on revamping security apparatus with a special focus on Alipiri Check Point.

On this occasion, the team of experts from L and T have given a detailed PowerPoint presentation over the State-of-the-Art Security facilities including the

modernisation of the Alipiri Checkpoint, high-capacity scanners, measures to be taken for expeditious completion of checks, parking management, traffic control, integrated surveillance system, common alarm management system, traffic enforcement system, No Helmet Detection, command control system and many more aspects 

Speaking on the occasion, the EO said that plans should be prepared to cater the needs keeping in view the next four decades needs of Tirumala. 

He asked the L&T representatives to come out with a comprehensive long-term and short-term plan on traffic checking and regulation.

TTD CV&SO Sri Muralikrishna, CE Sri Satyanarayana, L&T representatives, Transport and IT GM Sri Sesha Reddy, ASP Sri Ramakrishna, VGOs Sri Ram Kumar, Sri Surendra, Smt. Sada Lakshmi and other officials also participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్&టీ సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో సమావేశం

తిరుమల, 2025 జూలై 11: భక్తుల సౌకర్యార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్&టీ సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో శ్రీ జే.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 

ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ & క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఈవోకు సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అదే విధంగా దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక ప్రణాళికలు రూపొందించాలని L&T ప్రతినిధులను కోరారు.

ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారాయణ, L&T ప్రతినిధుల నిపుణుల బృందం, ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శ్రీ శేషారెడ్డి, ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, శ్రీమతి సదా లక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.