MEETING HELD ON HUMAN-ANIMAL CONFLICT _ తిరుమలలో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివార‌ణ‌ చర్యలపై సమీక్ష

TIRUMALA, 27 MAY 2025: In view of increased movements of wild cats along footpaths, ghat roads in Tirumala in the recent times, a review meeting on Human-Animal conflict was held at Gokulam Conference Hall on Tuesday.

TTD EO Sri J Syamala Rao (virtual participation) along with the Additional EO Sri Ch Venkaiah Chowdary and TTD Forest, State Forest and other stake holders, held a detailed meeting on how to tackle the issue with short term and long term plans and also on the overall management of MANIMAL Plan in TTD.

The excerpts from the meeting:

*To deploy additional forces and ensure timely Garbage Management all along the Alipiri Footpath route.

*To take up a Joint Drive all along the footpath route with the officials from Forest, Revenue and Panchayat Raj, Health and Vigilance departments of TTD with the support of Forest department officials in a regular manner.

*Wild Life Institute of India and

Forest Department to assist TTD in preparing Short-term and Long-term measures to overcome the Human-Animal conflict.

*More measures including camera traps, bio-fences, Net-Guns, high flash torches, Smart Sticks, pepper sprays and many more safety gadgets ensuring Alipiri Footpath a NO LEOPARD ZONE.

*To impose restrictions on shop-keepers sensitizing them on not to sell prohibited eatables.

*Focus more on surveillance from the Seventh Mile to the Lakshmi Narasimha Swamy temple located in the 2.5km stretch area along Alipiri Footpath route in Down Ghat road.

*Monthly coordination meeting on Human-Animal conflict with the officers concerned and the stake holders and discuss on the agendas with time lines.

Among the participants, Wild Life Institute of India Senior Scientist Sri Ramesh Krishnamurthy(Virtual), Conservator of Forest Sri Selvam, DFO Sri Vivek Anand, Deputy Conservator of Forest of TTD Sri Srinivasulu, DyEOs Sri Somannaryana, Sri Venkateswarulu, Health Officer Dr Madhusudhan, VGO Sri Surendra, AVSO Alpiri Sri Ramesh Krishnan and others were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివార‌ణ‌ చర్యలపై సమీక్ష

తిరుమ‌ల‌, 2025 మే 27: తిరుమలలోని అలిపిరి మెట్లమార్గం మరియు ఘాట్ రోడ్డుల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, ముఖ్యంగా చిరుతపులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారంనాడు గోకులం స‌మావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది.

టీటీడీ ఈవో శ్రీ జే. శ్యామల రావు (వర్చువల్‌) అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరితో కూడి ఈ సమావేశాన్ని టీటీడీ అటవీ శాఖ, అటవీ శాఖ, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

•⁠ ⁠అలిపిరి మెట్ల మార్గంలో భ‌క్తుల భ‌ద్ర‌త‌కు అద‌న‌పు సిబ్బంది కేటాయింపు

•⁠ ⁠ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య‌శాఖ ద్వారా చెత్త‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు

•⁠ ⁠టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో న‌డ‌క‌మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహణ.

•⁠ ⁠మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో Wild Life Institute, అటవీ శాఖల సహకారం.

•⁠ ⁠అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెసన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగం.

•⁠ ⁠నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించడం.

•⁠ ⁠అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన, నిఘాపై ప్రత్యేక దృష్టి.

•⁠ ⁠ప్రతి నెల మానవ-వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించడం.

ఈ స‌మావేశంలో వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ సైంటిస్ట్ డా. రమేష్ కృష్ణమూర్తి, చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్‌ శ్రీ సెల్వం, డి.ఎఫ్.ఓ శ్రీ వివేక్ ఆనంద్, టీటీడీ డీసీఎఫ్‌ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శ్రీ సోమన్నారాయణ, శ్రీ వెంకటేశ్వరులు, ఆరోగ్య అధికారి డా. మధుసూదన్, వీజీవో శ్రీ సురేంద్ర, అలిపిరి ఏవీఎస్ఓ శ్రీ రమేష్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.