TTD BOARD DISCUSSES IN LENGTH ON RADHASAPTHAMI ARRANGEMENTS _ తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు: టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

EXPECTING NEARLY 2.5-3LAKH PILGRIMS

ELABORATE ARRANGEMENTS FOR RATHASAPTHAMI – TTD CHAIRMAN

Tirumala, 31 January 2025: The TTD Trust Board under the Charimanship of Sri BR Naidu discussed in length on the arrangements to be made for the ensuing Radhasapthami scheduled to take place in Tirumala on February 04. 

Later briefing media at Annamaiah Bhavan on Friday along with the TTD EO Sri J Syamala Rao and other board members, the Chairman elaborated on the arrangements for the big day. Some excerpts:

Grand arrangements for Rathasapthami in Tirumala every year on the occasion of Surya Jayanti on Shukla Paksha Saptami Tithi.

Sri Malayappa Swami blesses the devotees in a procession on seven vehicles from morning to evening.

An estimated 2.50 -3lakh devotees are expected to come on that day and TTD has made arrangements for that.

Ashtadala Pada Padmaradhana, Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara services, darshan of NRIs, parents with infants, senior citizens and disabled persons stands cancelled on that day.

Slotted Sarvadarshan Tokens will not be issued in Tirupati from February 3 – 5.

Cancellation of VIP break darshan, except for protocol dignitaries on February 04 and as such no recommendation letters will be accepted on February 03 regarding VIP break darshan.

Devotees with Special Entry Darshan (SED) tickets are requested to report at the Vaikuntham queue complex only at the stipulated time on their tickets to avoid waiting.

 

Elaborate security with 1000 TTD Vigilance,1250 policemen besides Octopus, APSP, fire brigade, are being deployed

Provision of Entry, Exit and Emergency gates for devotees to the galleries 

Arrangement of NDRF and expert Swimmers at Pushkarini for chakra snanam

Supervision with senior officers to check the facilities provided to devotees in four mada streets

Continuous distribution of Annaprasadam, buttermilk, sambar rice, curd rice, pulihora, pongali to the devotees waiting in galleries

Provision of temporary sheds along Mada streets so that the devotees do not suffer from unfavourable weather conditions

Preparation of 8 lakh laddus which includes a buffer stock of 04 lakh

Electrical and Floral decorations 

LED screens are being set up so that the devotees can see the vahanams

Latest information to the devotees from time to time through public address system.

 

Live telecast by SVBC in HD quality to enable devotees across the world to watch Rathasaptami celebrations.

Necessary medical personnel, medicines and ambulances kept ready to provide emergency services to the devotees.

Deployment of 2500 srivari sevaks to provide services of Annaprasadam and water distribution to the devotees waiting in galleries.

Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO I/c Sri Manikantha were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పిభ్రవరి 4న రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లు

పటిష్ట భద్రతా చర్యలు

ఫిబ్రవరి 3 నుండి 5వ తేది వరకు ఎస్ఎస్ డి టోకెన్ల జారీ నిలిపివేత

టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు

తిరుమల, 2025 జనవరి 31: ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథ సప్తమి రోజున 2 – 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్ల గురించి ఛైర్మన్ వివరించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

వాహన సేవల వివరాలు
•⁠ ⁠ఉ. 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
•⁠ ⁠ఉ. 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
•⁠ ⁠ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
•⁠ ⁠మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
•⁠ ⁠మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
•⁠ ⁠సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
•⁠ ⁠సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
•⁠ ⁠రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

•⁠ ⁠అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.

•⁠ ⁠ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.

•⁠ ⁠తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.

•⁠ ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

•⁠ ⁠ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి.

విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ

•⁠ ⁠1250 మంది పోలీసులు, 1,000 విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు.

•⁠ ⁠ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు.

•⁠ ⁠గ్యాలరీలలోకి వచ్చే భక్తుల కొర‌కు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల‌తో పాటు అత్య‌వ‌స‌ర మార్గాలు (ఎమ‌ర్జెన్సీ గేట్లు) ఏర్పాటు.

•⁠ ⁠టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు.

•⁠ ⁠భ‌క్తుల సౌక‌ర్యార్థం చ‌క్ర‌స్నానానికి పుష్క‌రిణీలో ఎన్.డి.ఆర్.ఎఫ్, గ‌జ ఈత‌గాళ్ల ఏర్పాటు.

సీనియర్ అధికారులతో పర్యవేక్షణ

•⁠ ⁠మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాల ప‌రిశీల‌న‌కు సీనియర్‌ అధికారులతో నిరంత‌ర పర్యవేక్షణ.

అన్నప్రసాదాలు

•⁠ ⁠ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీ.

తాత్కాలిక షెడ్లు

•⁠ ⁠భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు ఇబ్బంది లేకుండా మాడ వీధుల్లో తాత్కాలిక‌ షెడ్లు ఏర్పాటు.

లడ్డూల నిల్వ

•⁠ ⁠భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన 8 ల‌క్ష‌ల ల‌డ్డూల త‌యారీ. (ఇందులో అందుబాటులో 04 ల‌క్ష‌ల ల‌డ్డూలు, అద‌నంగా మ‌రో 04 ల‌క్ష‌ల ల‌డ్డూల బ‌ఫ‌ర్ స్టాక్‌.

విద్యుత్ అలంకరణలు

•⁠ ⁠తిరుమలలో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు.

•⁠ ⁠భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించేలా భారీ ఎల్.ఈ.డీ స్ర్కీన్ లు ఏర్పాటు.

పుష్పాలంకరణలు

•⁠ ⁠తిరుమాడ వీధులను వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలు, పందిళ్లు, అరటి చెట్లతో అందంగా అలంకరణ.

పబ్లిక్ అడ్రెస్ సిస్టం

•⁠ ⁠భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా తాజా సమాచారం అందేలా చర్యలు.

ఎస్వీబీసీ

•⁠ ⁠ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు రథసప్తమి వేడుకను తిల‌కించేందుకు వీలుగా హెచ్ డీ క్వాలిటీతో ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం.

సాంస్కృతిక కార్యక్రమాలు

•⁠ ⁠శ్రీవారి వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు.

శ్రీవారి సేవకులు

•⁠ ⁠గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అన్న ప్ర‌సాదం, మ‌జ్జిగ‌, తాగునీరు అందించ‌డానికి వీలుగా దాదాపు 2500 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగం.

పారిశుద్ధ్య సేవలు

•⁠ ⁠భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు.

•⁠ ⁠వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి.

వైద్య సేవలు

•⁠ ⁠భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలు ఏర్పాటు.

ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ ఆనంద్ సాయి, శ్రీ శాంతారామ్, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ నరేష్, శ్రీ నర్సీ రెడ్డి, శ్రీమతి రంగశ్రీ, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మణికంఠ చందోలు, సీఈ శ్రీ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.