TTD CHAIRMAN, EO INAUGURATE GARDENS _ తిరుమలలో రెండు పార్కులను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Tirumala, 15 September 2023: As part of the beautification of Tirumala, two Gardens were developed at Filter House and GNC with the help of donor Sri VV Ravikumar which were inaugurated on Friday evening by TTD Board Chief Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy.
Annamaiya Circle Park at Filter House is beautifully designed with colourful flowers and greeneries. A system has been set up in the fountain here to listen to Annamayya’s hymns. For the development of the park Rs. 8 lakhs was spent and the donor provided Rs.30 lakhs for maintenance for five years.
Similarly, at GNC, the park has 65 high-end projected lights and a fountain named after Shanku Chakra. The donor has provided Rs.15 lakhs towards the development of this park and Rs.80 lakhs for its maintenance for 5 years.
JEO Sri Veerabraham, SE-2 Sri Jagadeeshwar Reddy, Deputy Director of Horticulture Sri Srinivasulu, Deputy CF Sri Srinivasulu, EE Sri Srihari, DE Sri Ravishankar Reddy, HO Dr Sridevi, VGO Sri Balireddy and others participated.
తిరుమలలో రెండు పార్కులను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమల, 2023 సెప్టెంబరు 15: తిరుమల సుందరీకరణలో భాగంగా దాత శ్రీ వివి.రవికుమార్ సహాయంతో ఫిల్టర్ హౌస్ వద్ద, జిఎన్సీ వద్ద అభివృద్ధి చేసిన రెండు పార్కులను శుక్రవారం రాత్రి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఫిల్టర్ హౌస్ వద్ద అన్నమయ్య సర్కిల్ పార్కును రంగురంగుల పూలమొక్కలు, పచ్చని మైదానంతో సుందరంగా రూపొందించారు. ఇక్కడి ఫౌంటెన్ లో అన్నమయ్య సంకీర్తనలు వినిపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్కు అభివృద్ధికి రూ. 8 లక్షలు, ఐదేళ్ల పాటు నిర్వహణకు రూ.30 లక్షలను దాత అందించారు.
జిఎన్సీ వద్ద రూపొందించిన పార్కులో 65 హై ఎండ్ ప్రొజెక్టెడ్ లైట్లు, శంకు చక్ర నామాలతో కూడిన ఫౌంటెన్ ఉన్నాయి. ఈ పార్కు అభివృద్ధికి రూ.15 లక్షలు, ఐదేళ్ల నిర్వహణ కోసం రూ.80 లక్షలను దాత అందించారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, డెప్యూటీ సీఎఫ్ శ్రీ శ్రీనివాసులు,
ఈ ఈ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.