ADDITIONAL EO REVIEWS ON SUMMER ARRANGEMENTS IN TIRUMALA _ తిరుమలలో వేసవి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
Tirumala, 27 February 2025: The Additional EO Sri. Ch. Venkaiah Chowdary directed the officials to take early steps so that lakhs of devotees who visit Tirumala during the ensuing summer vacation will not face any inconvenience.
He held a review meeting with the senior officials of various departments on the arrangements to be made in connection with the anticipated devout rush during the summer holidays and asked every department to prepare a 90-day plan to deal the summer pilgrim rush on Thursday at the Annamayya Bhavan in Tirumala.
Speaking on the occasion, the Additional EO directed the concerned officials to paint the white coolant at the important places like Akkagarla Gudi, Srivari Seva Sadan and all vital points in Tirumala, first ghat road where there is a lot of devotee traffic.
It has been directed to ensure that the power supply is uninterrupted so that the pilgrims do not face any inconvenience during summer. The temple authorities have been advised to keep sufficient buffer stock of laddus to meet the needs of the pilgrims.
Medical officials have been directed to keep sufficient stock of ORS packets for pilgrims. He directed the engineering officials to take early steps to supply the required water to the devotees in all parts of Tirumala in the coming summer. He also reviewed Annaprasadam, sanitation and others.
Deputy EOs Sri. Lokanatham, Sri. Rajendra, Sri. Bhaskar, Transport GM Sri. Sesha Reddy, VGOs Sri. Ram Kumar, Sri. Surendra and other officials participated in this review meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వేసవి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2025 ఫిబ్రవరి 27: తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.