KARTHEEKA POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ
Tirumala, November 15, 2024: Kartheeka Pournami Garuda seva was celebrated in Tirumala on Friday night with Sri Malayappaswamy Swamy rode on Mada streets on Garuda Vahana blessed the devotees.
Legend says that the Darshan of the Lord on Garuda Vahana beget devotees the punya of visiting all 108 Vaishnava Divya kshetras.
TTD Chairman Sri BR Naidu, Additional EO Sri CH.Venkaiah Chaudhary, Tirupati SP Sri Subbarayudu, Temple Deputy EO Sri Loganatham and other officers were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2024 నవంబరు 15: తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.