KATHIKA SNAPANA TIRUMANJANAM _ తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం

Tirumala, 17 November 2024: Karthika Snapana Tirumanjanam was held with religious splendour in Tirumala on Sunday.

As a part of Karthika Vanabhojanam, Sri Malayappa, Sridevi and Bhudevi were rendered Snapana Tirumanjanam in Vaibhavotsava Mandapam.

Later Vanabhojanam was arranged to the devotees.

EO Sri J Syamala Rao, DyEO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna, VGO Sri Surendra were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం

తిరుమల, 2024 నవంబరు 17: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.

అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు.

స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కర్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.