SPECTACULAR SRI PADMAVATHI PARINAYOTSAVAM COMMENCES IN TIRUMALA _ తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

DASAVATARA – ASTALAKSHMI MANDAPAM STANDS AS A VISITUAL MARVEL

TIRUMALA, 06 MAY 2025: The three-day annual Sri Padmavathi Parinayotsavams began on a grand religious note on Tuesday evening at the Narayanagiri Gardens in Tirumala, in the beautifully decorated

Dasavatara-Astalakshmi Mandapam with Rich fragrant traditional flowers and colourful cut flowers were used to celebrate the celestial wedding ceremony which will continue till May 8.

Around one ton of fruits, two tons of traditional flowers, and 30,000 cut flowers were used to decorate the mandapam, with the efforts of 150 garden staff and 50 electrical staff under the supervision of Garden Deputy Director Sri Srinivasulu.

On the auspicious Vaisakha Suddha Navami, Sri Malayappa Swamy arrived on the Gaja Vahanam, while Sri Devi and Bhudevi were carried on separate palanquins to the mandapam. 

Interesting wedding episodes including Edurkolu, Mala Parivarthanam, Poo Bantata were performed much to the excitement of devotees.

Later, chanting of Chaturvedas and accompaniment of traditional instrumental music for various ragas including Malahari, Neelambari, Kadana Kutuhala, Varahi, Desika and more along with Roopaka, Adi, Eka talas were presented during the divine wedding ceremony. 

TTD Chairman Sri B.R. Naidu, Board Member Smt. Panabaka Lakshmi, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Deputy EO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna, other officials, and a large number of devotees participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

భూలోక వైకుంఠాన్ని తల పించిన ” దశావతార – అష్టలక్ష్మి మండపం”

తిరుమల, 2025 మే 06: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన ” దశావతార – అష్టలక్ష్మి ” మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

ఒక టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మొదటిరోజు వైశిష్ట్యం :

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.

ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కదన కుతూహల, నీలంబారి వంటి వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.