VARAHA JAYANTI OBSERVED _ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
TIRUMALA, 05 SEPTEMBER 2024: The annual Varaha Jayanti was observed in Tirumala on Thursday.
Abhishekam was performed to the presiding deity of Sri Bhu Varaha Swamy.
TTD officials participated in this fete.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల, 2024 సెప్టెంబరు 05: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.