RECORD NUMBER OF DEVOTEES HAD DARSHAN OF SRI VENKATESWARA ON FRIDAY IN TIRUMALA _ తిరుమలలో శుక్రవారం రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం 

Tirumala, 14 June 2025: As the summer vacation is under completion with a few schools bound to reopen from Monday onwards, there has been a tremendous increase in the number of devotees visiting Tirumala this week.

The summer vacation rush was in its peak since May 15 onwards.

On Fridays, due to the  Abhishekam and other special sevas, the time available for general darshan usually reduces by two to three hours. 

Consequently, under normal circumstances, only around 60,000 to 65,000 devotees are able to have darshan on Fridays.

However, with the continuous monitoring by senior officials and with the coordinated efforts by various departments of TTD, over 10,000 additional devotees have been facilitated for darshan on each Friday during May and June this year.

A look at the recent Friday darshan statistics reveals that 74,374 devotees had darshan on May 23, 71,721 on May 30, and 72,174 on June 6. 

Notably, on June 13 (Friday), a record-breaking 75,096 devotees had the divine darshan of Sri Venkateswara Swamy.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 
తిరుమలలో శుక్రవారం రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం 
 
తిరుమల, 2025 జూన్ 14: వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే నెల 15 వ తారీఖునుండి విపరీతంగా పెరిగింది.
 
సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.
 
శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.
 
అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ లో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే మరియు జూన్ మాసాలలోని శుక్రవారాలలో దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరిగుతున్నది.
 
ఒక సారి దర్శన గుణాంకాలు పరిశీలిస్తే శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని  దర్శించుకోవడం విశేషం. 
 
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది