SWAMY PUSHKARINI GEARS UP TO HOST “TEPPA TIRUNALLU”_ తిరుమలలో శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలకు స‌ర్వం సిద్ధం

తిరుమలలో శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలకు స‌ర్వం సిద్ధం

తిరుమల, 2025 మార్చి 08: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 09వతేదీ ఆదివారం రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి.

ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప‌చుట్టూ నీటిజ‌ల్లులు(ష‌వ‌ర్‌) ప‌డేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్స‌వాల్లో అలంక‌ర‌ణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది ఆధ్వ‌ర్యంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచారు.

తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు.

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు

తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUMALA, 08 MARCH 2025: The sacred temple tank in Tirumala, the Swamy Pushkarini has geared up to host the Salakatla Theppottsavam which begins on March 9 and concludes on March 13.

Every night between 7pm and 8 pm the processional deities takes out a pleasure ride in the holy waters of Swamy Pushkarini blessing devotees on the finely decked floats. 

The Theppottsavam, which begins on Shuddha Ekadashi in the month of Phalguna every year concludes on the day auspicious day of Phalguna Pournami.

ARRANGEMENTS:

For this float festival, electrical illumination, floral decoration are in full spree while on the other hand, security arrangements have also been made and swimmers are also kept ready.

SIGNIFICANCE: Teppa means a small boat. The festival of Teppotsavam is the celebration of the pleasure ride by the processional deity in the sacred waters of the temple tank once in a year in the holy month of Phalguna. Teppotsavam is called ‘Thirupalli Odai Thirunal’ in Tamil and ‘Theppa Thirunallu’ in Telugu.

HISTORY: It is believed that the Teppotsavam has been taking place in Tirumala since ancient times. The Vijayanagara emperor Sri Saluva Narasimha Raya built the “Neerali Mandapam” in the middle of the Swamy Pushkarini in 1468 AD and made it suitable for the Teppotsavams.

On the first day, the procession deity of Srivaru graces on Teppa in Ramavatara, second day in Sri Krishnavatara taking three rounds on waters, while on the last three days as Sri Malayappa along with Sridevi and Bhudevi, He takes three, five and seven rounds on Teppa respectively and blesses devotees.

Due to the Teppotsavam, TTD has cancelled the Sahasradeepalankara Seva on March 9th and 10th, and the Arjitha Brahmotsavam and Sahasradeepalankara Seva on March 11th, 12th, and 13th.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI