TIRUVENGADA RAMANUJA JIYAR TIRU NAKSHATROTSAVAMS _ తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు

Tirumala, 27 Sep. 20: The Pedda Jiyar Mutt at Tirumala located in front of Srivari temple adjacent to Sri Bedi Anjaneya Swamy temple observed its 900th anniversary on Sunday.

Though the fete commenced during last week, the Tiru Nakshatrotsavam of Tiruvengada Ramanuja Jiyar was observed on Sunday.

Tiruvengada Ramanuja Jiyar was the first Pontiff of Pedda Jiyar mutt in Tirumala after it was established by Sri Sri Sri Ramanujacharya.

On this occasion, Nalayira Divya Prabandham recitation, Sattumora were being observed in Ramnujacharya Sannidhi located in the mutt from the past ten days.

Sri Pedda Jiyar Swamy, Sri Chinna Jiyar Swamy of Tirumala along with their disciples took part in this fete.

Meanwhile, there will be Padi Samarpana to Sri Pedda Jiyar Swamy from  Srivari temple in connection with this occasion on Monday evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు

తిరుమల, 2020 సెప్టెంబరు 27: తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు ఆదివారం నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే. ఈ మఠానికి మొదటి పెద్ద జీయర్ అయిన శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రమును పురస్కరించుకొని మఠంలోని శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర గత 10 రోజులుగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శిష్యు బృందం పాల్గొన్నారు.

కాగా ఈ తిరునక్షత్రోత్సవాల సందర్బంగా సోమవారం సాయంత్రం శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామివారికి శ్రీవారి ఆలయం నుండి పడి సమర్పించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.