SRI PURANDARA DASA IS THE EMBODIMENT OF SAGE NARADA _ తిరుమలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం

SRI PADARAJA MATH MATHADHIPATHI SRI SUJAYANIDHI TIRTHA SWAMIJI

GRAND COMMENCEMENT OF SRI PURANDARA DASA ARADHANA MAHOTSAVAMS AT TIRUMALA

Tirumala, 17 January 2026: Sri Purandara Dasa, the doyen of Carnatic music and Padakavita, is truly the embodiment of Sage Narada, said Sri Sujayanidhi Tirtha Swamiji, Peetadhipathi of Sri Padaraja Math.

The Sri Purandara Dasa Aradhana Mahotsavams began grandly on Saturday at Tirumala under the aegis of the TTD Dasa Sahitya Project.

As part of the celebrations, various programmes were conducted at the Asthana Mandapam in Tirumala, including Suprabhatam, meditation, mass bhajans, Nagara Sankeerthana, a Purandara Sahitya Goshti, Mangalaasasanams by various Peetadhipathis, and Sankeerthana Mala programmes. Sri Sujayanidhi Tirtha Swamiji and Sri Vidya Vijaya Tirtha Swamiji offered their Mangalaasasanams on the occasion.

Addressing the devotees, Sri Sujayanidhi Tirtha Swamiji said that human life is encircled by numerous problems, and to overcome them, Nama Sankeerthana holds special importance among the ninefold paths of devotion. He stated that the scriptures proclaim the necessity of the grace of the Lord’s foremost devotees to attain God, and Sri Purandara Dasa stands as a supreme devotee in this tradition. Today, thousands of devotees chant the innumerable compositions of Purandara Dasa and become recipients of the Lord’s grace, highlighting the unique significance of Nama Sankeerthana in the Kali Yuga.

Later, the Special Officer of the TTD Dasa Sahitya Project, Sri Anandatheerthacharyulu, presented Srivari prasadam to the Swamijis and honoured them with shawls.

Thousands of devotees from Andhra Pradesh, Karnataka, and Tamil Nadu participated in the programme.

On the second day, January 18, at 6 a.m., floral tributes will be offered to the statue of Sri Purandara Dasa at Alipiri. In the evening at 6 p.m., a procession of Srivari Utsava Murthis will be held from the Srivari Temple to Narayanagiri Gardens, followed by Unjal Seva and Dasa Sankeerthana programmes.

On the final day, January 19, Suprabhatam, meditation, mass bhajans, Nagara Sankeerthana, discourses, and a Sangeetha Vibhavari programme will be conducted in the morning.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ నారద మహర్షి స్వరూపులే శ్రీ పురందరదాసులు

శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ

తిరుమలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2026 జనవరి 17: కర్ణాటక సంగీత, పద కవితా  పితామహులు శ్రీ పురందరదాసులు సాక్షాత్తు నారద స్వరూపులని శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.

శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సాహిత్య‌ గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ, శ్రీ వీద్యా విజయ తీర్థ స్వామీజీ మంగ‌ళ శాస‌న‌ములు అందించారు.

ఈ సందర్భంగా శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ మాన‌వ జీవితం స‌మ‌స్య‌ల వ‌ల‌య‌మ‌ని, వీటి నుండి బ‌య‌ట‌ప‌డాలంటే న‌వ‌విధ భ‌క్తిమార్గాల్లో నామ‌సంకీర్త‌న‌కు విశేష ప్రాధాన్యం ఉంద‌ని తెలిపారు. భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు.

అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు స్వామీజీలకు శ్రీవారి ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

కాగా, రెండవ రోజైన జ‌న‌వరి 18న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు జ‌న‌వరి 19న ఉదయం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, ఉపన్యాసములు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.