తిరుమలలో సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారం – భక్తులు ఇలాంటి అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞపి

తిరుమలలో సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారం – భక్తులు ఇలాంటి అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞపి

తిరుమల 28 ఆగస్టు 2021: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న దానం పై శనివారం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. భక్తుల్లో, దాతల్లో అనవసర ఆందోళన రేకెత్తించే ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.

సాంప్రదాయ భోజనం ఆలోచనకు సంబంధించిన అసలు నిజాలు ఇవీ..

– తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారు.

వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారు.

– ప్రయోగాత్మకం గా టీటీడీ ఒక పెద్ద క్యాంటీన్ లో భక్తులకు సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.

– ఇది విజయవంతమైతే ఒక క్యాంటీన్ లో మాత్రమే భక్తులకు సంప్రదాయ భోజనం ఏర్పాటు చేస్తాము.

– సాధ్యాసాధ్యాలను బట్టి నెమ్మదిగా మిగతా క్యాంటీన్ లను టీటీడీ నిర్వహించాలని భావిస్తోంది.

– ఇందుకోసం లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందించనున్నాము.

– నిత్యాన్నదాన భవనంలో కూడా దాతల సహాయంతో ప్రస్తుతం అందుతున్న కూరగాయలతో పాటు, మరిన్ని కూరగాయలు, దినుసులు తెప్పించి రోజుకోరకమైన కూరను వడ్డించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది.

– బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన సంప్రదాయ భోజనాన్ని టీటీడీ యాజమాన్యమే అందజేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం.

– అసలు నిజాలు ఇలా ఉంటే కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

– శ్రీవారి భక్తులు, దాతలు ఇలాంటి అసత్య ప్రచారం విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా ధార్మిక సంస్థ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది