తిరుమలలో హనుమజ్జయంతి

తిరుమలలో హనుమజ్జయంతి

 తిరుమల, 2010 జూన్‌ 06: ఈనెల 7వ తేదిన శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న  శ్రీ బేడిఆంజనేయ స్వామివారి ఆలయంలో, అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు వద్ద వున్న  శ్రీ పసన్న ఆంజనేయస్వామి వారి విగ్రహం వద్ద హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా 7వ మైలు వద్దనున్న శ్రీ పసన్న ఆంజనేయస్వామి వారి విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వేడుకలకు హజరయ్యే భక్తుల సౌలభ్యం కొఱకు తితిదే ప్రత్యేకంగా ఈరోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత బస్సులను తిరుమల నుండి ఏర్పాటు చేసింది.

కనుక భక్తులు తితిదే కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని హనుమజ్జయంతి వేడుకలో పాల్గొనవచ్చును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.