ADDITIONAL EO INSPECTS ANJANADRI WORKS _ తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ & ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ అద‌న‌పు ఈవో

TIRUMALA, 15 FEBRUARY 2022: Additional EO Sri AV Dharma Reddy on Tuesday inspected the Anjanadri site near Akasa Ganga where Bhoomi Puja is going to take part on February 16 and verified the ongoing arrangements.

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Surendranath Reddy, DE Electrical Sri Ravishankar Reddy, Health Officer Dr Sridevi, DyEOs Sri Harindranath, Sri Selvam, DFO I/c Smt Prasanti, Civil Surgeon Dr Kusuma Kumari, Prof Rani Sadasivamurthy, SV Higher Vedic Studies Institute Project Officer Dr A Vibhishana Sharma and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ ‍ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ అద‌న‌పు ఈవో

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 15: ఫిబ్రవరి 16న తిరుమ‌ల‌లో ఆకాశ గంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో భూమి పూజ ‍నిర్వ‌హించేందుకు చేప్ప‌టిన ప‌నుల‌ను అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఇందులో భాగంగా భూమి పూజ నిర్వ‌హించే ప్రాంతం, ప‌రిస‌రాలు, ప్ర‌ముఖులు కుర్చునే వేదిక‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా భ‌క్తులు, మీడియాకు అవ‌స‌ర‌మైన పోడియం, తదితర ఏర్పాట్లను ప‌రిశీలించారు. ఆకాశ‌గంగ వ‌ద్ద పుష్పాల‌తో అందంగా ముస్తాబు చేయాల‌ని, భూమి పూజ ‍ జ‌రిగే ప‌రిస‌రాల్లో మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

టిటిడి సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ – 2 శ్రీ జ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇఇలు శ్రీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, శ్రీ సురేంద్ర నాథ్ రెడ్డి, ఇన్‌చార్జ్ డిఎఫ్‌వో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీ‌దేవి, అశ్విని ఆసుప‌త్రి సివిల్ సర్జన్ డా. కుసుమ‌కుమారి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హ‌దారులు శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు రాణి సదాశివమూర్తి, ఎస్వీ ఉన్నత‌ వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, మాజీ టిటిడి బోర్డు స‌భ్యులు (దాత‌) శ్రీ నాగేశ్వ‌ర‌రావు, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.