TIRUMALA FORESTS SHOULD STAND AS A ROLE MODEL IN BIO-DIVERSITY-TTD EO _ తిరుమల అడవులను దేశంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి
TIRUMALA, 05 JUNE 2023: The green cover of Seshachala Ranges should stand as a role model in rich biodiversity in the entire country, said TTD EO Sri AV Dharma Reddy.
The EO participated in the plantation programme taken up in the Special Type Cottages area in Tirumala on the occasion of World Environment Day on Monday. Speaking during the event the EO said, TTD has won the Environment Award thrice. Millions and millions of devotees visit Tirumala every year from across the country as well as the globe. The Tirumala forests need to be developed in such a way that they should provide an aesthetic feel to the multitude of visiting pilgrims”, he added.
To make Tirumala ranges pollution-free, under the aegis of TTD Forest Wing, the plantation of 2000 plants has been taken up which will be supervised by various HoDs. The plants include Ficus Dalhousie, which is a very rare species in Tirumala woods. There are only four such trees identified in the Seshachala ranges. These species are common in the Western Ghats. TTD has been executing a massive plantation programme with Sandalwood, Ficus bengalensis, Peepal, Mimusops etc. on nearly 3000 hectares. Besides safeguarding these species, TTD has also taken up measures to avoid forest fires and also increasing the underground water percentage”, he maintained.
Along with EO Smt Padma of Narasaraopet and Sri Vamsikrishna from Abudabi also participated in the plantation programme.
Among officers, DFO Sri Srinivasulu, EEs Sri Jaganmohan Reddy, Sri Srinivasa Rao, DyEO R2 Sri Bhaskar, FROs Sri Venkatasubbaiah, Sri Srinivas and others were present.
In Tirupati:
Following the World Environment Day, plantation programme has been taken up in SV Traditional Sculpture College, SPW Degree and PG College, SPW Junior College, SGS Degree College by the students and also in the Human Hair Godown in the guidance of respective College Principals under the supervision of DEO Dr Bhaskar Reddy.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల అడవులను దేశంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి
– ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి
తిరుమల 05 జూన్ 2023: భూలోక వైకుంఠమైన తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అడవులను దేశంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన స్పెషల్ టైపు కాటేజీల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో 2 వేల మొక్కలు అన్ని విభాగాధిపతుల పర్యవేక్షణలో నాటనున్నట్లు తెలిపారు. ఇందులో ఫైకాస్ డల్హౌసి అనే రావి, మర్రి జాతికి చెందిన వృక్షాలు ఉన్నట్లు తెలిపారు. ఈ జాతి వృక్షాలు తిరుమలలో నాలుగు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
తిరుమలలో పచ్చదనం పెంపొందించినందుకుగాను టీటీడీ ఇప్పటికే మూడుసార్లు పర్యావరణ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. శేషాచల అడవుల్లో సహజసిద్ధంగా ఎర్రచందనం మొక్కలు ఏ విధంగా అయితే పెరుగుతాయో, పశ్చిమ కనుమల్లో ఫైకాస్ డల్హౌసి మొక్కలు అదేవిధంగా పెరుగుతాయన్నారు. సప్తగిరులలో జీవవైవిద్యం, పచ్చదనం పెంపొందించడంలో భాగంగా 3 వేల హెక్టార్లలో శ్రీ గంధం, మర్రి, రావి, మాను సంపంగి, పొగడ, కదంబం మొదలైన జాతుల వృక్షాలను నాటుతున్నట్లు తెలియజేశారు. ఈ మొక్కలను సంరక్షించడంతో పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు, భూమిలో నీటి శాతం పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి తిరుమలలో పచ్చదనానికి పాటుపడాలన్నారు.
ఈవో తో పాటు నరసారావు పేటకు చెందిన శ్రీమతి పద్మ , అబుదాబికి చెందిన శ్రీ వంశీకృష్ణ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు, ఈఈ -1 శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఈఈ (ఎఫ్ ఎం ఎస్ ) శ్రీ శ్రీనివాసరావు డిప్యూటీవో ఆర్2 శ్రీ భాస్కర్ ఎఫ్ ఆర్ ఓ లు శ్రీ వెంకటసుబ్బయ్య, శ్రీ శ్రీనివాస్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతిలో….
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాల, తలనీలాలు భద్రపరుచు గోడౌన్, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల , జూనియర్ కళాశాల, ఎస్ జిఎస్ డిగ్రీ కళాశాలల వద్ద 2 వేల మొక్కలు నాటారు.
డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి ,ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది