MTVAC FMS STAFF WAGES PROBLEM SETTLES _ తిరుమల అన్నదానం కాంప్లెక్స్ లో విధులు నిర్వహించే కార్మికుల సమస్య పరిష్కారం
Tirumala, 18 July 2024: The wages issue of the FMS staff working in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) was settled by TTD on Thursday.
TTD JEO Sri Veerabrahmam speaking to the FMS workers said already the wages of the staffs was forwarded to the Contractor through the concerned Bank during last week itself.
He also told them, the wages of first batch workers was already paid to their accounts while the second batch received their salaries on Thursday.
Meanwhile the Annaprasadam workers met the officials over their wages issue only during their break time, without troubling the devotees.
Afterwards they attended their duties
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల అన్నదానం కాంప్లెక్స్ లో విధులు నిర్వహించే కార్మికుల సమస్య పరిష్కారం
తిరుమల, 2024 జూలై 18: తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో విధులు నిర్వహించే ఎఫ్ఎంఎస్ కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందలేదని గురువారం నాడు టీటీడీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా సంబంధిత కార్మికులతో జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, సిబ్బంది జీతాలు సదరు బ్యాంకు ద్వారా వారి కాంట్రాక్టర్ కు గత వారమే పంపడం జరిగిందన్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ కార్మికుల జీతాలు పంపడం జరిగిందని, ఈరోజు రెండవ బ్యాచ్ కార్మికుల జీతాలు కూడా వారి అకౌంట్లలో వేయడం జరిగిందని ఆయన తెలిపారు.
కాగా అన్న ప్రసాదం కార్మికులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ విధుల విరామ సమయంలోనే అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం వారు యధావిధిగా తమ విధులకు హాజరయ్యారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.