KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ‌ఆళ్వార్ ‌తిరుమంజనం

Tirumala, 16 September 2025: The sacred Koil Alwar Tirumanjanam was performed with grandeur at the Tirumala Srivari Temple in a religious manner on Tuesday. 

The temple Archakas, officials, and staff participated in this traditional temple purification ritual.

On this occasion, TTD Executive Officer Sri Anil Kumar Singhal addressing the media said that the cleansing ritual was performed in connection with the annual Brahmotsavams of Sri Venkateswara from September 24 to October 02. 

He said Koil Alwar Tirumanjanam is observed on the Tuesdays occurring before Brahmotsavams, Ugadi, Anivara Asthanam, and Vaikuntha Ekadasi. 

From Anandanilayam up to Bangaru Vakili, including the inner sanctum, sub-shrines, prasadam counters, temple premises, walls, ceilings, and puja materials, everything was thoroughly cleansed with the sacred \’\’Parimalam\’\’ mixture.

The purification ritual was carried out from 6 AM to 10 AM as per Agama traditions and later devotees were allowed for Darshan of Sri Venkateswara after performing special Puja and offering Naivedyam\’\’, he maintained.

TTD Chairman Sri B.R. Naidu, and several board members, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, officials participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2025 సెప్టెంబర్ 16: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 24 నుండి అక్టోబ‌రు 02వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లన్ని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు\’\’, అని తెలిపారు. 

పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు\’\’, అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.