తిరుమల తిరుపతి దేవస్థానములో మొట్టమొదటి సారిగా హెల్త్‌క్లినీక్
తిరుమల తిరుపతి దేవస్థానములో మొట్టమొదటి సారిగా హెల్త్‌క్లినీక్
తిరుపతి, జనవరి-5, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములో మొట్టమొదటి సారిగా హెల్త్‌క్లినీక్ ప్రారంభించబడుచున్నది. కార్యనిర్వహణాధికారి వారి ఆదేశముల మేరకు తి.తి.దే ముఖ్యవైద్యాధికారి, తితిదే వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యములో కార్యక్రమం నిర్వహించబడును.
తి.తి.దే ఆధ్వర్యమున నిర్వహించబడుచున్న మొత్తము తొమ్మిది పాఠశాలలో సుమారు 5000 నుండి 6000 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుచున్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేసి తగుసూచనలు, సలహాలు మరియు అవసరమైనచో మందులు అందించబడును. తి.తి.దే ఉద్యోగస్తుల పిల్ల్లలకే కాక, తి.తి.దే పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించబడును. ఈ కార్యక్రమమును 6-1-2009 వ తేదీ గౌరవనీయులు శ్రీ శేషాద్రిగారు, తి.తి.దే సంయుక్తకార్యనిర్వహణాధికారి ప్రారంభించెను.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.