INSPECTION OF TTD CHAIRMAN IN FOUR MADA STREETS _ తిరుమల నాలుగు మాడ వీధుల్లో టిటిడి ఛైర్మన్ పరిశీలన

Tirumala, 31 January 2025: On Friday evening, the TTD Chairman Sri BR Naidu along with TTD EO Sri J Syamala Rao, Additional EO Sr. Ch Venkaiah Chowdary and In-charge CVSO Sri. Manikantha Chandolu inspected the arrangements being made along the four mada streets of Tirumala in connection with Radhasapthami on February 04.

As a part of it they verified entry, exit and emergency gates arranged for the sake of devotees in the galleries and other arrangements were examined.  

The authorities have been advised to issue announcements to the devotees in the galleries from time to time through the public address system.  

After entering the gallery, the devotees were asked to regularly provide the necessary facilities such as food, drinking water, buttermilk etc.  

In view of the past experience, it is suggested that steps should be taken to ensure that the devotees can view the Srivari Vahana services conveniently. 

TTD Board members including Sri J Nehru, Sri MS Raju, Smt Panabaka Lakshmi, Sri Bhanuprakash Reddy, Sri Ananda Sai, Sri Shanta Ram, Sri N Sadasiva Rao, Sri Naresh, Sri Narsi Reddy, JEO Sri Veerabrahmam, CE Sri Satyanarayana and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల నాలుగు మాడ వీధుల్లో టిటిడి ఛైర్మన్ పరిశీలన

తిరుమల 2025, జనవరి 31: ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి పాలకమండలి సభ్యులు, టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇంఛార్జి సివిఎస్వో శ్రీ మణికంఠ చందోలుతో కలిసి శుక్రవారం సాయంత్రం ఛైర్మన్ పరిశీలించారు.

తిరుమల మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తొలుత వాహన మండపానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్, పాలక మండలి సభ్యులు, టిటిడి ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, ఇంఛార్జి సివిఎస్వో, టిటిడి అధికారులు నాలుగు మాడ వీధుల్లో కలియ తిరిగారు.

ఈ తణిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ ఆనంద్ సాయి, శ్రీ శాంతారామ్, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ నరేష్, శ్రీ నర్సీ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మణికంఠ చందోలు, సీఈ శ్రీ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది