A STEP AHEAD IN TIRUMALA ENVIRONMENTAL PROMOTION _ తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌రో ముంద‌డుగు

ELECTRIC BUSES TO REPLACE FREE DHARMA RATHAMS IN TIRUMALA

TTD CHAIRMAN REVIEWS WITH OLECTRA REPS

OLECTRA DONATES 10 FREE DHARMA RARTHAMS TO TTD

Tirumala, 21 October 2022: With another decisive step as part of the environmental protection in Tirumala, TTD has rolled out electric buses in the place of free Dharma Ratham buses which are being operated to shuttle within the hill town premises for the sake of a multitude of visiting pilgrims.

In this connection, the TTD Chairman Sri YV Subba Reddy conducted a review meeting at the Annamaiah Bhavan on Friday with the representatives of Olectra Co., APSRTC and TTD officials.

Speaking on the occasion, the Chairman said that on the directions of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, TTD has already taken several initiatives to transform Tirumala into a pollution-free pilgrim centre and the ban on plastic bottles and covers was one of them while the eco-friendly vehicles succeeded the decision.

He said in the first phase, electric battery-operated cars were provided to TTD employees in Tirumala and later electric buses were introduced between Tirumala and Tirupati which received a huge response from devotees.

Upon the request of TTD Chairman, Sri Krishna Reddy, the Proprietor of Olectra Co.has readily agreed to provide 10 electric buses in the place of Dharma Ratham – the free bus facility for the transportation of pilgrims to their desirable destinations within Tirumala.

The Chairman lauded the Company which has come forward to donate ₹15 crore worth 10 electric vehicles to TTD and soon another session would be organised to decide on the design and their maintenance for the convenience and comfort of devotees 

He said in the next phase all taxis and rented vehicles in Tirumala will be transformed into electric vehicles with TTD sponsoring them with bank loans.

Speaking on the occasion CMD Sri Pradeep of Olectra Company said they were blessed to be involved in the service of Sri Venkateswara Swamy by donating electric buses. Earlier a powerpoint presentation was made on the bus designs, maintenance and other aspects by a representative of the Company.

RTC Executive Director Sri Gopinath Reddy, RTC DM Sri Chengal Reddy, TTD Transport GM Sri Sesha Reddy and Tirumala Depot Manager Sri Vishwanath and others were present.

TTD CHAIRMAN TRAVELS IN AN ELECTRIC BUS

Thereafter the TTD chairman travelled in an electric bus from Annamaiah Bhavan to Lepakshi circle along with TTD officials for a hands-on experience of the bus operation.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌రో ముంద‌డుగు

– ధ‌ర్మ‌ర‌థం ఉచిత బ‌స్సుల స్థానంలో విద్యుత్ బ‌స్సులు

– ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధుల‌తో టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి స‌మీక్ష‌

– చైర్మ‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు 10 బ‌స్సులు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చిన ఒలెక్ట్రా కంపెని

తిరుమ‌ల‌, 2022 అక్టోబరు 21: తిరుమ‌ల ప‌విత్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో టీటీడీ మ‌రో ముంద‌డుగు వేసింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ రథాల (ఉచిత బ‌స్సుల‌) స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల‌కు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు, ఆర్‌టిసి, టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌ను కాలుష్య ర‌హిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్ధ‌డానికి ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, క‌వ‌ర్ల నిషేదం కూడా ఇందులో ఒక భాగమ‌న్నారు. తొలివిడ‌త‌గా తిరుమ‌ల‌లో ప‌నిచేసే అధికారుల‌కు విద్యుత్‌తో న‌డిచే కార్ల‌ను అంద‌జేశామ‌న్నారు. రెండ‌వ విడ‌త‌గా తిరుప‌తి, తిరుమ‌ల మ‌ధ్య విద్యుత్ బ‌స్సులు ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. వీటికి భ‌క్తుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపారు. రెండ‌వ విడ‌త‌లో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ‌ర‌థాల స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు 10 బ‌స్సులు విరాళంగా ఇవ్వాల‌ని ఒలెక్ట్రా కంపెని అధినేత శ్రీ కృష్ణారెడ్డిని కోరాన‌ని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బ‌స్సుల‌ను విరాళంగా అందించేందుకు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. బ‌స్సుల డిజైనింగ్‌, నిర్వ‌హ‌ణ ఎలా ఉండాల‌నే అంశంపై చ‌ర్చించేందుకు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌క్తుల‌కు స‌దుపాయంగా ఉండేలా బ‌స్సుల‌ను డిజైన్ చేయాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు.

మూడ‌వ ద‌శ‌లో తిరుమ‌ల‌లో తిరిగే ట్యాక్సీలు, ఇత‌ర అద్దె వాహ‌నాల స్థానంలో టీటీడీ స‌హ‌కారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు బ‌స్సుల డిజైన్లు, నిర్వ‌హ‌ణ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కోరిక మేర‌కు 10 విద్యుత్ బ‌స్సులు విరాళంగా అందించ‌డం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు త‌మ‌కు అందించిన గొప్ప వ‌రంగా భావిస్తున్నామ‌ని కంపెని సిఎండి శ్రీ ప్ర‌దీప్ చెప్పారు. ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ గోపినాథ్ రెడ్డి, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ చెంగ‌ల్‌రెడ్డి, టీటీడీ ర‌వాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, తిరుమ‌ల డిపో మేనేజ‌ర్ శ్రీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించిన టీటీడీ చైర్మ‌న్‌

అనంత‌రం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నం నుండి లేపాక్షి స‌ర్కిల్ వ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధికారుల‌తో క‌లిసి విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.