CELESTIAL UMBRELLAS REACHES _ తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
TIRUMALA, 07 OCTOBER 2024: The Thirukkodi-celestial umbrellas used during the Garuda Vahana Seva have reached Tirumala on Monday.
Every year, the Chennai-based donors present the Eleven umbrellas to be used in the procession of Sri Malayappa Swamy on the auspicious fifth evening during the ongoing annual brahmotsavams in Tirumala.
Both the Pontiffs of Tirumala, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
తిరుమల, 2024 అక్టోబరు 07: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
చెన్నైకి చెందిన తిరుపతి అంబ్రాలా చారిటిస్ ట్రస్టీ శ్రీ వరదరాజులు 11 గొడుగులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.