తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుపతి, జూన్ 11, 2013: బెంగళూరుకు చెందిన శ్రీ ఆనంద ప్రభు మంగళవారం తిరుమల శ్రీవారికి రూ.10 లక్షలను విరాళంగా అందించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిని దాత అందజేశారు. ఈ సొమ్మును తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని దాత కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.