Release of Sri Vari Navarathri Brahmotsavam Wall poster _ తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
Tirumala, 29 Sep 2012: TTD Chairman Sri K.Bapi Raju, TTD EO Sri L.V.Subrahmanyam has released Sri Vari Navarathri Brahmotsavam wall poster which begins from Oct 15 in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Sep 29
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, 2012 సెప్టెంబరు 29: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్లను తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి పాలకమండలి అధ్యకక్షులు, ఈవో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మొదటి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని రెండో బ్రహ్మోత్సవాలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతున్నామని తెలిపారు.
అనంతరం తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటుచేసి ఎక్కువ మందికి స్వామివారి వాహనసేవలు తిలకించే అవకాశం కల్పిస్తామన్నారు. పాలకమండలి సభ్యుల సహకారంతో ఉద్యోగులందరం కష్టపడి పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.