ABHISHEKAM PERFORMED TO LAKSHMINARASIMHA _ తిరుమలలో ఘనంగా నరసింహ జయంతి
Tirumala, 25 November 2019: TTD has organised special abhishekam to Sri Lakshmi Narasimha Swamy temple located in the Alipiri walkers path on Monday morning.
The unique festival is held every year during Karthika month on the advent of Swathi star, under the supervision of the Potu section of Srivari temple.
Besides a grand snapana thirumanjanam TTD has also conducted special puja, which was followed by Anna Prasadam to devotees.
Additional EO Sri AV Dharma Reddy, Srivari temple DyEO Sri Harindranath and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో ఘనంగా నరసింహ జయంతి
తిరుమల, 2019 నవంబరు 25: అలిపిరి నడకమార్గంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం నరసింహ జయంతి ఘనంగా జరిగింది. కార్తీక మాసం, స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఏడాదీ ఇక్కడ నరసింహ జయంతిని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ పోటు విభాగం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.