TIRRUPPAVI PARAYANAM AT SRI PEDDA JEEYARSWAMY MUTT _ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం
Tirumala,17 December 2021: As part of Srihari Dhanurmasa Mahotsavam, the Tiruppavai parayanam is organised at Sri Sri Sri Pedda Jeeyar Swamy Mutt in Tirumala everyday morning between 8.30-9.30 hours up to January 14 which commenced on Friday.
The Pedda Jeeyar Swamy Mutt was established in Tirumala during the period of Sri Bhagavad Ramanujacharya, the founder of Vishistadvaita philosophy in the country.
All the kaikaryas and practices were performed at the Srivari temple as per the Vaiskhanasa Agama pronounced by Sri Ramanujacharya.
Sri Sri Sri Pedda Jeeyar Swamy who is continuing the Sri Ramanujacharya traditions is supervising all the sevas, kaikaryas, and utsavas that are being performed at Srivari Temple in Tirumala.
Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala and other Vedic pundits were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం
తిరుమల, 2021 డిసెంబరు 17: శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం జరుగుతోంది. 2022 జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్‌స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఇతర పండితులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.