GT TEPPOTSAVAMS ENTERS DAY 4 _ తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీ కృష్ణస్వామివారి విహారం

TIRUPATI, 09 FEBRUARY 2025: On the fourth day evening on Sunday as a part of the ongoing annual Teppotsavams of Govinda Raja Swamy Temple, Sri Andal sameta Sri Krishna Swamy blessed His devotees on the finely decked float.

Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, Deputy EO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, other officials and a large number of devotees participated in the Teppotsavam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీ కృష్ణస్వామివారి విహారం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 09: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఆదివారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్స‌వ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

కాగా సోమవారం నుండి బుధవారం వరకు శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.