DAY 5 OF SRI GOVINDARAJA SWAMY TEPPOTSAVAM _ తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి విహారం
Tirupati, February 10, 2025: As part of the ongoing annual Teppotsavam of Sri Govindaraja Swamy Temple.
on the 5th day, Monday evening, Sri Govindaraja Swamy, along with Sridevi and Bhudevi, graced the devotees by taking a ride on the richly decorated float.
Earlier in the afternoon Swamy and Ammavaru were offered Snapana Thirumanjanam. Later, they took a procession through the four Mada streets of the temple and blessed the devotees.
The Swamy and his consorts went round total of seven rounds of the flower and electric light decked float in the Pushkarini and assured the devotees.
On Tuesday, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi will perform seven rounds again on the float.
TTD organised bhajans, Harikatha, and musical progress under the auspices of the TTD Hindu Dharmaprachara Parishad and Annamacharya Project.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD JEO Sri V. Veerabrahamam, FACAO Sri O. Balaji, Temple Deputy EO Smt. V.R. Shanthi other officials and a large number of devotees were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి విహారం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 10: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా మంగళవారం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఎవో శ్రీ ఓ.బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీమతి వి.ఆర్.శాంతి, శ్రీ సి. గోవింద రాజన్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.