SRI KALYANA VENKATESWARA SWAMY TEPPOTSAVAM _ తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
Tirupati, 28 January 2026: As part of the Govindaraja Swamy Teppotsavams, on the third day, Wednesday, Sri Kalyana Venkateswara Swamy blessed devotees by giving divine darshan from 6:30 pm to 8 pm.
The Utsava deity accompanied by His consorts, glided on the float in the temple Pushkarini and later participated in a procession along the four mada streets.
The event was attended by HH Pedda Jeeyar Swamy and HH Chinna Jeeyar Swamy of Tirumala, TTD officials, and a large number of devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2026 జనవరి 28: గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా గురువారం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు
తెప్పోత్సవాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




