PADMAVATI BLESSES IN FLOAT FESTIVAL_ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం

Tirupati,2, June 2023: On the third day of the ongoing float festival (Teppotsavam) of Sri Padmavati temple, Tiruchanoor, Sri Padmavati rode on a colourful float and blessed devotees 

As part of the festivities, Goddess Padmavati was given Abisekam at Nirada Mandap after daily Kainkaryas in the morning.

In the impressive float festival in the evening, Sri Padmavati went three rounds and later paraded on Mada streets as well to bless devotees.,

Dyeo Sri Govindarajan,archaka Sri Babuswami ,inspector Sri Subhash,Sri  Ganesh were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
 
తిరుపతి, 2023 జూన్‌ 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.