MALAYAPPA SHINES ON TEPPA _ తెప్పపై శ్రీ మలయప్పస్వామి అభయం
Tirumala, 12 March 2025: Srivari Salakatla Teppotsavam in Tirumala on Wednesday evening witnessed Sri Malayappa along with Sridevi and Bhudevi blessing devotees on the finely decked float.
Taking five pleasure rounds on the holy waters of Swamy Pushkarini, the deities blessed devotees.
HH Tirumala Sri Chinna Jeeyar Swamy, AP Police Recruitment Board Chairman Sri RK Meena, temple DyEO Sri Lokanatham and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీ మలయప్పస్వామి అభయం
తిరుమల, 2025 మార్చి 12: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ ఆర్కే మీనా, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.