SECOND-DAY FLOAT FEST _ తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

TIRUPATI, 18 JUNE 2024: On the second evening on Tuesday, Sri Padmavati Devi took a celestial ride on the finely decked Teppotsavam.

The Goddess took out three rounds in the sacred waters of Padma Pushkarini blessing Her devotees.

Temple DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
 
తిరుపతి, 2024 జూన్‌ 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం శ్రీసుందరరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.  మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 నుండి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన బుధవారం 
శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూపరిండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, ఇతర ఆధికారులు,  విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.