తెలుగువారి స్వంతం హరికథాగానం _ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ

తెలుగువారి స్వంతం హరికథాగానం _ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ

తిరుపతి 24 మార్చి 2023: హరికథాపితామహుడుఅజ్జాడఆదిభట్లనారాయణదాసుతో ప్రారంభమైన హరికథాసంప్రదాయంమనతెలుగువారి స్వంతమని, తెలుగు భాషలో తప్ప ఏయితరభాషలోను హరికథాగానం లేదనితిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్యప్రాజెక్టు సంచాలకులు డా.ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు .

అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచర్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రామాయణ హరికథా సప్తాహ యజ్ఞం ప్రారంభమైంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ విభీషణ శర్మ మాట్లాడుతూ, హరికథ లలితకళల సమాహార స్వరూపమన్నారు. సంగీతం సాహిత్యం నాట్యంమూడింటిలోను ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే హరికథాగానం సమర్ధవంతంగా నిర్వహించగలరని హరికథ విశిష్టతను ఆయన వివరించారు.

తుడా సెక్రటరీ శ్రీమతి లక్ష్మిజ్యోతి ప్రజ్వలనంతోశ్రీసీతారామకల్యాణహరికథాగానంతో ఈసప్తాహంప్రారంభమయ్యింది. ఈసందర్బంగా అన్నమాచార్య ప్రాజెక్టు హరికథా కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రిని శ్రీవేంకటేశ్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతిఉమాముద్డుబాల, శ్రీభగవాన్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఘనంగా సత్కరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది