POTTI SRIRAMULU – PRIDE OF TELUGUS –  TTD MUSEUM CHIEF _ తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ పొట్టి శ్రీరాములు : టీటీడీ చీఫ్ మ్యూజియం అధికారి శ్రీ క్రిష్ణా రెడ్డి

Tirupati, 16 March 2024: Amarajeevi and a great Patriot Sri Pottu Sriramulu was an icon of Telugu Pride said TTD Chief Museum Officer Sri Krishna Reddy. 

Participating in the grand Sri Potti Sriramulu Jayanti fete held at Annamacharya Kala Mandira on Saturday as chief guest, he said Sriramulu was influenced by Mahatma Gandhi teachings and joined Sabarmati ashram and there onwards went to jail after Sslt and Quit India agitations. 

After several assignments as director of Gandhi Trust and a campaign for Dalit temple entry, he launched hunger satyagraha at Bulusu Sambamurthy home on Royapetah Road in Madras till his death. 

Speaking later CPRO DrT Ravi said the non-violent method adopted by him became a road model in the formation of linguistic states. 

Earlier several TTD employees also spoke and paid floral tributes to his portrait.

DyEO Welfare Department Smt Snehalata presided over the function attended by large number of employees. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ పొట్టి శ్రీరాములు : టీటీడీ చీఫ్ మ్యూజియం అధికారి శ్రీ క్రిష్ణా రెడ్డి

తిరుపతి, 2024 మార్చి 16: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని టీటీడీ చీఫ్ మ్యూజియం అధికారి శ్రీ క్రిష్ణా రెడ్డి కొనియాడారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని శ‌నివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీఫ్ మ్యూజియం అధికారి శ్రీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ, చెన్నైలో పుట్టి పెరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు ముంబైలో రైల్వే ఉద్యోగం చేశారని చెప్పారు. ఆ తర్వాత గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సబర్మతి ఆశ్రమానికి వెళ్లారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గాంధీ స్మారక నిధి సంచాలకులుగా మద్రాస్ రాష్ట్రమంతా పర్యటించేవారని, తద్వారా ఆయనకు ప్రజా సమస్యలు తెలిసేవని చెప్పారు. ఇతరుల కోసం తమ జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడేవాడే నాయకుడిగా నిలుస్తాడని, శ్రీ పొట్టి శ్రీరాములు ఇందుకు నిదర్శనమని అన్నారు. చెన్నై రాయపేట రోడ్డులో గల శ్రీ బులుసు సాంబమూర్తి నివాసంలో నిరాహార దీక్ష ప్రారంభించారని, ఎంతో పట్టుదలతో దీక్షను కొనసాగించి చివరకు ప్రాణత్యాగం చేశారని వివరించారు.

అనంత‌రం సిపిఆర్వో డా.టి.ర‌వి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తెలుగు భాషకున్న ప్రాముఖ్యత, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకుని ఆయన అహింసా పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. గాంధీజీ శిష్యుడిగా మారి జాతీయోధ్య‌మంలో పాల్గొని ఆరు సార్లు జైలుకు వెళ్ల‌ర‌న్నారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటు పడ్డారని చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లాలన్న ఆయన దృఢ సంకల్పం ఎంతో గొప్పదన్నారు.

త‌రువాత‌ పలువురు టీటీడీ ఉద్యోగులు ప్రసంగించారు. అంత‌కుముందు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు.

సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత అధ్యక్షతన జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.