దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి – టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్. నాయుడు

దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్. నాయుడు

స్విమ్స్ నందు సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులు ప్రారంభం

తిరుమల, 2025 డిసెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బి.ఆర్. నాయుడు వెల్లడించారు.

చైర్మన్ బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, . రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు.

ఇందులోరోగులసహాయకులకుఉచితభోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా ఈ రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ గారు చైర్మన్ గారికి వివరించారు.

టీటీడీ ఆధ్వర్యంలో  స్విమ్స్ లో  పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు చెప్పారు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

టిటిడిఆధ్వర్యంలోనిఅన్నిఆసుపత్రుల్లోరోగులకుమరిన్నిమెరుగైనవైద్యసేవలుఅందించేందుకుకృషిచేస్తున్నామనితెలిపారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి  ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్  ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాలు ప్రారంభించామన్నారు. రెండో దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించామని, అతిత్వరలోనే టిటిడి సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసియులతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్  సెంటర్ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమాల్లో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీ శాంతారాం, శ్రీ నరేష్కుమార్, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి.జగదీష్, చీఫ్ ఇంజినీర్ శ్రీ టివి. సత్యనారాయణ, స్విమ్స్(టిటిడి) ఇంజినీర్లు శ్రీ ప్రసాద్, శ్రీ పార్థసారథి, శ్రీ బాలాజి తదితర ఇంజినీరింగ్ సిబ్బంది మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి ఎం.సుగుణమ్మ, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ శ్రీ ఆర్. సి. మునికృష్ణ గార్లు మరియు ఇతర నాయకులు, టిటిడి, స్విమ్స్ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.