TTD CAUTIONS DEVOTEES NOT TO APPROACH MIDDLEMEN FOR DARSHAN _ దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు
STRINGENT ACTION AGAINST DALARIS
CASE FILED ON TAMIL NADU CYBER CENTRE OPERATOR – TTD
Tirumala, 23 August 2024: TTD has once again appealed to the devotees only to use the official website, https://ttdevasthanams.ap.gov.in with their Aadhar card for booking online Darshan and other services and urged them not to trust the middlemen for Darshan and Seva tickets.
It may be mentioned here that four devotees from Tamil Nadu entered the Vaikuntam with alleged fake tickets for Srivari Kalyanotsavam on Thursday and were identified and enquired by TTD vigilance officials. Investigations revealed that they procured the fake tickets from a cyber center of Tirupattur in Vellore district of Tamil Nadu. The cyber centre operator Annadurai booked the tickets charging huge amounts by altering last two numbers in the passport. TTD vigilance officials have filed a complaint with the police against the concerned person.
The present administration of TTD is keen on detecting the fake websites and identifying Dalaris who have been involved in cheating devotees. There are complaints that some brokers are collecting huge sums from gullible devotees assuming them to book Darshan tickets. It is a regular practice by the TTD vigilance to recheck all the tickets ahead of allowing devotees for Darshan. If the tickets are identified as fake, the devotees will be put to hardships.
In this context, TTD has once again reiterated and warned that stringent action will be taken against those brokers involved in cheating pilgrims with fake Darshan and Arjita Seva tickets. At the same time also cautioned devotees only to book Darshan and Seva tickets on TTD official website.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు
– దళారులను నమ్మి మోసపోకండి
– తమిళనాడుకు చెందిన నెట్ సెంటర్ నిర్వాహకుడి పై కేసు : టీటీడీ
తిరుమల 23 ఆగస్టు 2024: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టిటిడి అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in
ద్వారా మాత్రమే ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్ట పోవద్దని టీటీడీ మరో మారు విజ్ఞప్తి చేస్తోంది.
తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించి, విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్ పోర్ట్ లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత టిటిడి యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికా వద్దని టీటీడీ తెలుపుతోంది. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది.
స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరోసారి హెచ్చరిస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.