DASA DEVOTEES TO ASSIST IN BRINGING UP DASA SAHITYA SARVASWAM- EO TTD _ దాససాహిత్య సర్వసం కోసం భక్తులు సహకరించాలి : టిటిడి ఈవో
Tirupati, 03 February 2021: All the Dasa devotees should come forward and join hands with TTD in bringing out the valuable Dasa Padagalu to see light in the form of a compilation mulled by TTD named as Dasa Sahitya Sarvaswam, said TTD EO Dr KS Jawahar Reddy.
Reviewing with Dasa Sahitya Project officials of TTD via video conference from his chambers in the Administrative Building on Wednesday, the EO said, there are still lakhs of Kannada Dasa Padas which are yet to see light.
There are some tens of thousands of Sankeertans available in the Universities, libraries and with the successors of Kannada Dasas in Karnataka. All such Kirtans shall be gathered and published in the form of a book by TTD which will be useful for many.
The pundits who participated in the meeting told EO that they will definitely put their efforts in bringing out the sankeertanas and in their compilation. They sought wide publicity through SVBC and the media for this divine mission.
While agreeing to their request, TTD EO said Sri. Vijay Mutalik, an ardent devotee from Bengaluru will act as a coordinator.
Dasa Sahitya Project Special Officer Sri PR Ananda Theerthacharyulu and other scholars were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దాససాహిత్య సర్వసం కోసం భక్తులు సహకరించాలి : టిటిడి ఈవో
తిరుపతి, 2021 ఫిబ్రవరి 03: కర్టాటక హరిదాసవరేణ్యుల సంకీర్తనలను దాససాహిత్య సర్వస్వం పేరుతో టిటిడి ముద్రించదలచిందని, ఇందుకు భక్తుల సహకారం అవసరమని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి కోరారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయం నుండి దాససాహిత్య ప్రాజెక్టు అధికారులతో ఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాదిగా ఉన్న కర్ణాటక హరిదాస కీర్తనలను పుస్తకరూపంలోకి తెచ్చే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించిందన్నారు. ఇందులో కొన్ని కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు. మిగిలినవి కర్ణాటకలోని వివిధ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లోను, దాససాహిత్య వంశీకులు వద్ద ఉన్నాయని, వాటిని తాము సేకరించి పరిష్కరిస్తామని పండితమండలి సభ్యులు ఈవోకు తెలిపారు. ఇందుకోసం ఎస్వీబీసీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించే ఏర్పాటు చేయాలని పండితులు కోరారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన శ్రీ విజయ్ ముతాలిక్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని ఈవో తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, పండిత మండలి సభ్యులు డా. ప్రభంజనాచార్, డా. నాగరత్న, డా.గోకుల్నాథ్, డా. హయవదన పురానిక్, శ్రీ విజయ్ ముతాలిక్, డా. నాగరాజాచార్యులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.