129th CONVOCATLION HELD AT DHARMAGIRI VEDA VIGNANA PEETHAM _ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేడుకగా 129వ స్నాతకోత్సవం

Tirumala, 08 January 2026: The 129th Convocation of the 141-year-old Veda Vignana Peetham located at Dharma Giri in Tirumala was held in a grand way on Thursday.

On this occasion the Principal of the Veda Vijnana Peetham, Sri Kuppa Siva Subrahmanya Avadhani, stated that 146 students were trained as scholars in Vedas, Agamas, and Smartha traditions. 

He expressed his aspiration that the graduates, having transformed from learners into teachers, should go on to nurture good students in the future and emphasized that while everything has an end, education has no end.

Later, 146 graduates who completed their Vedic education were presented with certificates along with Srivari silver coins.

Faculty and students, the office staff, and parents of the students participated in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేడుకగా 129 స్నాతకోత్సవం

తిరుమల, 2026 జనవరి 08 : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం గురువారం వేడుకగా జరిగింది.

ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలోని 146 విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పట్టాలు పొందిన స్నాతకులు విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారు. దేనికైనా అంతం ఉంటుంది కానీ విద్యకు అంతం ఉండదని తెలియజేశారు. 

అనంతరం వేద విద్య పూర్తి చేసుకున్న 146 మంది స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పండితులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.