DISPLAY DHARMIC VIDEOS ON TTD WEBSITE- TTD EO SINGHAL _ ధార్మికాంశాల వీడియోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 27 January 2020: TTD Executive Officer, Sri Anil Kumar Singhal had advised officials of HDPP and SVBC to telecast dharmic videos in the channel and also upload them in TTD website to educate children on religious topics and also enlighten them for Dharmic exams.

He was reviewing the activities of HDPP at the TTD administrative building on Monday. He also instructed officials to create a one-month course of basics in Vedas, puranas, temples etc. to propagate Hindu Santayana dharma.

He asked the officials to prepare an action plan for the Managudi program scheduled in May next for thousands of students .He also wanted officials to update the Archaka training courses for SC, ST, BC and fishermen with easily understandable video content on Shodasha samskaralu, poojas and vratams. The EO asked the concerned to plan for three phased Archaka training programs to be held in areas near Visakhapatnam and Rajahmundry instead of bringing them all the way to Tirupati.

He also wanted TTD to publish books with stories in dharmic values in language to reach larger sections of devotees. To begin with he wanted the Saptagiri to publish series of stories on Annmaiah in Sapthagiri.

He also wanted grand plans for Annamaiah Jayanti celebrations, all certificates for Veda pathasala courses to be issued by Vedic varsity, Dasa Sahitya Project and Alwar Divya Prabandam Project to publish books in English as well.

He also directed that the 80,000 pages incomplete with the Puranaithihasa project should be tendered for private works and the books already cleared under the project be processed for printing at the earliest.

TTD JEO Sri P Basant Kumar, HDPP Secretary Sri Acharya Rajagopalan and others participated.

Later in the evening a review meeting on Pranadanam and SRIVANI trusts was held. FACAO Sri Balaji, CE Sri Ramachandra Reddy, SVIMS Director Dr Vengamma, CMO Dr Nageswara Rao were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ధార్మికాంశాల వీడియోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2020 జనవరి 27: పిల్ల‌లకు స‌నాతన ధ‌ర్మంపై మ‌క్కువ పెంచేందుకు స‌నాత‌న ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌లు ఎంత‌గానో దోహ‌దం చేస్తున్నాయ‌ని, మ‌రింత మంది పిల్ల‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు ముఖ్య‌మైన ధార్మికాంశాల వీడియోలు రూపొందించి టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌డంతోపాటు ఎస్వీబీసీలో ప్ర‌సారం చేయాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాల‌పై సోమ‌వారం తిరుప‌తిలోని టిటిడి పరిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మంలోని ప్రాథ‌మికాంశాల‌తో ఒక నెల వ్య‌వ‌ధితో కూడిన కోర్సును రూపొందించాల‌ని, విద్యార్థిని విద్యార్థుల‌కు చ‌క్క‌గా అవ‌గాహ‌న క‌ల్పించేలా, ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఇందులో పాఠ్యాంశాల‌ను రూపొందించాల‌ని కోరారు. ఈ కోర్సులో వేదాలు, పురాణాలు, ఆల‌యాల వైశిష్ట్యం, హైంద‌వ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌హానుభావుల కృషి త‌దిత‌ర అంశాల‌ను పొందుప‌ర‌చాల‌న్నారు.  మే నెల‌లో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆల‌యాల్లో మ‌న‌గుడి కార్య‌క్ర‌మాన్ని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కారుల‌కు 3 ద‌శ‌ల్లో అర్చ‌క శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని, ఈ శిక్ష‌ణ‌లో షోడ‌శ సంస్కార‌ములు అనే అంశాన్ని పొందుప‌ర‌చాల‌ని, పూజ‌లు/వ‌్ర‌తాల నిర్వ‌హ‌ణ సులువుగా అర్థ‌మ‌య్యేలా వీడియోలు రూపొందించి చూపాల‌ని సూచించారు. వైజాగ్‌, రాజ‌మండ్రి త‌దిత‌ర దూర ప్రాంతాల నుండి తిరుప‌తికి రాన‌వ‌స‌రం లేకుండా ఆయా ప్రాంతాల‌కు స‌మీపంలో అర్చ‌క శిక్ష‌ణ ఏర్పాటుచేస్తే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌న్నారు.

స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతికి సంబంధించి చిత్రాల‌తో కూడిన క‌థ‌ల‌ను రూపొందించి ముద్రించ‌డం ద్వారా ఎక్కువ మందికి చేర‌తాయ‌ని ఈవో తెలియ‌జేశారు. స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌లో అంద‌రికీ సులువుగా అర్థ‌మ‌య్యేలా శ్రీ తాళ్ల‌పాక అన్నమ‌య్య‌పై ప్ర‌తి నెలా ఒక‌టి చొప్పున వ‌రుస‌గా క‌థ‌నాలు ప్ర‌చురించాల‌ని సూచించారు. ఈసారి అన్న‌మ‌య్య జ‌యంతి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ముంద‌స్తు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కోరారు. వేదపాఠ‌శాల‌ల్లో మెరుగైన ప్ర‌మాణాలు పాటించేందుకు ఎస్వీ వేద వ‌ర్సిటీ ద్వారా ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు ప్ర‌దానం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ద్వారా ముద్రించే పుస్త‌కాల‌ను ఇంగ్లీషులోనూ త‌ర్జుమా చేయాల‌ని కోరారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టులో డిటిపి చేయ‌ని 80 వేల పేజీల‌ను టెండ‌రు ద్వారా పూర్తి చేయ‌ల‌ని సూచించారు. ప‌రిష్క‌ర‌ణ పూర్త‌యిన గ్రంథాల‌ను వెంట‌నే ముద్ర‌ణ‌కు పంపాల‌ని ఆదేశించారు.

శ్రీ‌వాణి ట్ర‌స్టు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుల‌పై ఈవో స‌మీక్ష‌

అనంత‌రం టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ‌వాణి ట్ర‌స్టు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు కార్య‌క‌లాపాల‌పై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు ప‌రిధిలో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో స్విమ్స్‌, బ‌ర్డ్ ఆసుప‌త్రుల్లో జ‌రిగిన వైద్య‌చికిత్స‌ల వివ‌రాల‌ను ఈవో అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రోగుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యాలు అందించాల‌ని సూచించారు. అనంత‌రం శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పూర్త‌యిన ఆల‌యాలు, ఇంకా నిర్మాణం చేప‌ట్టాల్సిన ఆల‌యాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ స‌మావేశాల్లో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఒ.బాలాజి, స్విమ్స్ సంచాల‌కులు డా. వెంగ‌మ్మ‌, సిఎంవో డా. నాగేశ్వ‌ర‌రావు, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ త‌దితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.