EKADASHI CELEBRATIONS BEGINS AT UPAMAKA _ ధ్వజారోహణంతో ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు ప్రారంభం
Tirupati, 10 March 2025: The Ekadasi Kalyanams began with a grand start on Monday at Sri Venkateswara Swamy Temple in Upamaka, Anakapalli district.
These Kalyanams will be performed till March 17.
As part of this, on Monday from 8am to 10am, a palanquin festival was held for Sri Venkateswara Swamy along with Sridevi, Bhudevi and Sri Sudarsana Perumal.
Kalyanotsavam started with Dhwajarohanam from 10 am to 12 noon.
From 7.40 pm to 11.30 pm, “Sannaha Mahotsavam” (Kanya-Varuna Samvadam) was conducted.
In this, Sridevi on the Garuda carrier and Bhudevi on the Sesha Talpa carrier were brought to Vedika.
Later on Tuesday, March 11, from 12.30 am to 3.30 am Kalyanotsavam will be held grandly for Swami and Ammavarlu.
AP State Home Minister Smt. Anitha, Anakapalli District Collector Sri Vijayakrishnan, TTD AEO Sri. Jaganmohanachary Superintendent Sri. Venkata Ramana, Temple Inspector Sri. Kurmeshwar Rao, other officials of the temple were present in this program.
Meanwhile, on Tuesday night between 7.40pm to 9.30pm, Hamsa Vahanam will take place.
On March 12 from 9pm to 10 pm, Sri Bhu Sameta Sri Venkateswara Swamy ride on the Punyakoti Vahanam.
On March 13, from 2.30 pm to 6 pm Tototsavam will be observed wherein Sri Bhu Sameta Sri Venkateswara Swamy will appear on Rajadhiraja Vahanam. Later from 7.30 pm to 10 pm Gaja Vahanam takes place.
Chakra Snanam will be held on March 14 from 2.30 pm to 9.30 pm while Rathotsavam from 10.30 pm to 12 midnight.
The Dhwajavarohanam ceremony will be held on March 15 from 5.45pm to 6.30 pm and Pavalimpu seva will be held on March 16 and 17 between 8pm and 9 pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజారోహణంతో ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు ప్రారంభం
• వైభవంగా శ్రీవారి కల్యాణం
తిరుపతి, 2025 మార్చి 10: అనకాపల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ఏకాదశి కల్యాణాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ కల్యాణాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన పెరుమాళ్‌కు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధ్వజారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి.
రాత్రి 7.40 నుండి 11.30 గంటల వరకు ఎదురు సన్నాహ మహోత్సవం ( కన్యావరుణ సంవాదం) నిర్వహించారు. ఇందులో శ్రీవారు గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు శేష తల్ప వాహనంపై భక్తులను కటాక్షించారు. తరువాత మార్చి 11వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 12.30 (సోమవారం అర్థరాత్రి) నుండి ఉదయం 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
కల్యాణోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన ఉపమక పరిసర ప్రాంతాల భక్తులు భక్తి పరవశంతో పులకించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయక్రిష్ణన్, ఏఈవో శ్రీ జగన్మోహన ఆచ్చారి, సూపరింటెండెంట్ శ్రీ వెంకట రమణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుర్మేష్వారావు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
కాగా మంగళవారం రాత్రి 7.40 నుండి 9.30 గంటల వరకు స్వామివారు హంసవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మార్చి 12వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తోట ఉత్సవం, శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు రాజాధిరాజవాహనంపై దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు చక్రస్నానం జరగనుంది. రాత్రి 10.30 నుండి అర్థరాత్రి 12 గంటల వరకు రథోత్సవం వైభవంగా జరగనుంది.
మార్చి 15వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 16, 17వ తేదీలలో రాత్రి 8 నుండి 9 గంటల వరకు పవలింపు సేవ నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.