SRI VENKATESWARA SWAMY BRAHMOTSAVAMS BEGIN GRANDLY AT KURUKSHETRA _ ధ్వజారోహణంతో కురుక్షేత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవారంభం

Tirupati, June 25, 2026: The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple at Kurukshetra, Haryana, commenced grandly on Thursday with Dhwajarohanam performed as per Pancharatra Agama amid Vedic chants and Govinda namasmarana.

The nine-day festival will feature various Vahana Sevas, Kalyanotsavam, Garuda Seva, Rathotsavam, Chakrasnanam, and Dhwajavarohanam. The highlight Garuda Seva and Kalyanotsavam will be held on June 29.

The Brahmotsavams will conclude with Chakrasnanam and Dhwajavarohanam on July 3, followed by Pushpayagam on July 4.

TTD AEO Sri Balaraju, Temple Inspector Sri Mohan Reddy, officials, priests, staff, and devotees participated in the inaugural ceremony.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో కురుక్షేత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవారంభం

గోవింద నామస్మరణల మధ్య ఆధ్యాత్మిక శోభ

జూలై 4 పుష్పయాగంతో ఉత్సవాలకు ముగింపు

తిరుపతి, 2026 జూన్ 25: హర్యానా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయివేదఘోషలుమంగళవాయిద్యాలుభక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు పాంచరాత్ర ఆగమోక్త విధానంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అధికారిక శ్రీకారం చుట్టగాభక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

బ్రహ్మోత్సవాల విశేషాలు

 

జూన్ 25 – పెద్దశేష వాహనం

జూన్ 26 – చిన్నశేష వాహనంహంస వాహనం

జూన్ 27 – సింహ వాహనంముత్యపుపందిరి వాహనం

జూన్ 28 – కల్పవృక్ష వాహనంసర్వభూపాల వాహనం

జూన్ 29 – మోహినీ అవతారంశ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవంగరుడ వాహనసేవ

జూన్ 30 – హనుమంత వాహనంగజ వాహనం

జూలై 1 – సూర్యప్రభ వాహనంచంద్రప్రభ వాహనం

జూలై 2 – రథోత్సవంఅశ్వ వాహనం

జూలై 3 – చక్రస్నానంధ్వజావరోహణం

జూన్ 29 ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనుండగాసాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారుఅనంతరం గరుడ వాహనసేవ జరగనుంది.

జూలై 3 పవిత్ర చక్రస్నానంధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూలై 4 పుష్పయాగం

బ్రహ్మోత్సవాల అనంతరం జూలై 4 సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

 కార్యక్రమంలో టీటీడీ ఏఈవో శ్రీ బాలరాజుటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మోహన్‌రెడ్డిఅధికారులుఅర్చకులుసిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.