SRI SOWYANATHA SWAMY BRAHMOTSAVAMS COMMENCES _ ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
Tirupati, 05 July 2025: The annual Brahmotsavams of the ancient TTD taken over temple Sri Sowmyanatha Swamy at Nandalur began on Saturday with Dhwajarohanam between 10.30 and 11 AM in the auspicious Simhalagnam.
The sacred Garuda flag was hoisted amidst Vedic chants and devotional music.
TTD officials including Deputy EO Smt. Prasanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Dilip, devotees participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025, జూలై 05: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 10.30 – 11.00 గంటల వరకు సింహలగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది.
శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.