ANNAUL KARTHIKA BRAHMOTSAVAMS OFF TO A COLOURFUL START AT TIRUCHANOOR _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, DECEMBER 2: Kartheeka Brahmotsavams, the nine-day annual event of Goddess Padmavathi Devi of at the pilgrim town of Tiruchanoor off to a grand start with the conduct of the celestial ceremony of Dhwajarohanam on Thursday morning signaling the successful commencement of the mega religious fete with pomp and gaiety.

 The sacred fete has been performed in the temple of Goddess Padmavathi during Makara Lagnam between 9:40am to 10:00am by hoisting the turmeric drape with the image of the divine elephant, the  favourite ride of Goddess atop Dhwajastambham-the temple pillar amidst the traditional recitation of Vedic hymns by temple priests as per the norms of Pancharatra Agama.


 The ceremony was attended by Sri I.Y.R.Krishna Rao, the Executive Officer of TTD, Dr.N.Yuvaraj, Joint Executive Officer of Tirupati, Sri M.K.Singh, C.V&S.O, Sri Munirathnam Reddy, DyEO(PAT), Sri Sivakumar Reddy, Addl C.V&S.O and a large number of devotees.


 Later the TTD EO has released 2011 diary inside the temple. The EO has also released a book titled “Sri Padmavathi Ammavari Vahana Sevalu” penned by Dr.A.Vibhishana Sharma.


The EO has also inaugurated the flower show at Friday Gardens in Tiruchanoor with colourful flowers depicting various mythological themes which was designed and decorated by the Garden department of TTD to entertain the visiting pilgrims. The Mythological themes included “Sagara Madanam”, Gajendra Moksham”, “Brigu Garva Bhangam”, “Panchamukha Anjaneya” etc. Ornamental flowers like Roses, gerania, guineas, poinsettias, kolius, asparagus, Asiatic lilies, carnations have been used for the purpose by the garden department to give a splendid look to the mythological flower show. The TTD garden superintendent Sri Srinivasulu said that about 20thousand pots of the ornamental flowers have been used for the purpose.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD

 

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2010 డిశెంబర్‌-03: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం నాడు ధ్వజారోహణ పర్వంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయాయి.

తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా కొనసాగే అమ్మవారి బ్రహ్మోత్సవ  వేడుకలలో భాగంగా తొలిరోజు ఉదయం 9.40-10.00 గం||ల నడుమ మకర లగ్నం నందు వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆలయ అర్చకులు, వేదపండితులు, పాంచారాత్ర ఆగమోక్తంగా పద్మావతీదేవి ఇష్ట వాహనం అయిన గజచిత్ర పటాన్ని ఆలయ ధ్వజస్థంభం పై లాంఛనంగా ఎగుర వేసి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకానికి నాంది పలికారు. ”ధ్వజోజీవస్స ఉచ్యతే” అంటే ఈ నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలతో పాటుగా ఇతర భక్త కోటిని ఆహ్వానించడమే నన్నది అంతరార్థం. అలమేలు మంగమ్మ వార్షికోత్సవాలలో మకుటాయమాయమైన కార్తీక బ్రహ్మోత్సవాలను తిలకించిన సర్వపాపాలు హరించబడునన్నది ఆర్యోక్తి. అందుకే అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవ ప్రారంభోత్సవ మహోత్సవాన్ని తిలకించడానికి వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసారు.

ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి (తిరుపతి) డా||యన్‌ యువరాజ్‌, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎమ్‌.కె.సింగ్‌,  ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ మునిరత్నం రెడ్డి, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం తితిదే ఇ.ఓ ఆలయంలో 2011 నూతన సంవత్సర తితిదే డైరీని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ ఆకెళ్ళ విభీషణ శర్మ విరచించిన ”శ్రీ పద్మావతీ అమ్మవారి వాహన సేవలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తరువాత తిరుచానూరులోని శుక్రవారపు ఉద్యానవనాలలో (ప్రైడే గార్డెన్స్‌) ఫలపుష్ప ప్రదర్శనను, ఆయుర్వేద ప్రదర్శనను తితిదే ఇ.ఓ లాంఛనంగా ప్రారంభించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ఫలపుష్ప ప్రదర్శనశాలలో పౌరాణిక అంశాల నేపథ్యంలో వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన గజేంద్రమోక్షం, క్షీరసాగరమథనం, భృగుగర్వభంగం, పంచముఖఆంజనేయస్వామి వంటివి కనువిందుచేస్తున్నాయి. ఈ పుష్పప్రదర్శన కొరకు ఇరవైవేల పూలతొట్లను, వివిధ అలంకార పుష్పాలను ఉపయోగించామని తితిదే ఉద్యానవనశాఖాధికారి శ్రీ శ్రీనివాసులు తెలిపారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.