ANNUAL BRAHMOTSAVAMS COMMENCE AT TARIGONDA SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, February 24, 2026: The annual Brahmotsavams of Sri Lakshmi Narasimha Swamy Temple near Gurramkonda in Annamayya district commenced on Tuesday with the ceremonial Dhwajarohanam held between 8.00 am and 9.00 am in Meena Lagnam.
Special pujas were performed to the Garuda flag before hoisting it on the Dwajasthambam, inviting all deities to the annual festival. In the evening, the deity will bless devotees on Hamsa Vahanam.
TTD has made elaborate arrangements for the Brahmotsavams from February 24 to March 5, including shelters, queue lines, barricades, illumination and floral decorations. Vahana Sevas will be conducted daily in the morning and evening.
Temple officials, archakas and devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2026, ఫిబ్రవరి 24: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సమీపంలోగల తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.
ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 08.00 నుండి 09.00 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి 08.00 గం.లకు హంస వాహనం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ఎం.గోపినాథ్, అర్చకులు శ్రీ కృష్ణ రాజన్, శ్రీ కృష్ణ ప్రసాద్, శ్రీ గోపాల్ బట్టర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బీ.ఈ.కృష్ణమూర్తి, శ్రీ నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టిటిడి
ఫిబ్రవరి 24 నుండి మార్చి 05 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలను చేపట్టారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
24.02.2026
రాత్రి – హంసవాహనం,
25.02.2026
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – హనుమంత వాహనం
26.02.2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సింహ వాహనం
27.02.2026
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – పెద్దశేష వాహనం
28.02.2026
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – గజవాహనం
01.03.2026
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – సర్వభూపాల వాహనం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం( రాత్రి 11 నుండి)
02-03-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – ధూళి ఉత్సవం
03-03-2026
ఉదయం – సూర్యప్రభవాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం (రాత్రి 08.30 నుండి 09.30గం.ల వరకు), పార్వేట ఉత్సవం( రాత్రి 09.30 – 10.00 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 10.00 నుండి 11.30 గంటల వరకు)
04-03-2026
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 8 గంటల వరకు), చక్రస్నానం (ఉదయం 11.30 గంటలకు)
రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)
మార్చి 05వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

