BRAHMOTSAVAMS BEGIN AT PUNGANUR SRI KALYANA VENKATARAMANA SWAMY TEMPLE _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 24 February 2026: The annual Brahmotsavams of Sri Kalyana Venkataramana Swamy Temple in Annamayya district commenced on Tuesday with the ceremonial Dhwajarohanam performed between 9.50 am and 10.45 am in Mesha Lagnam.
Earlier, Suprabhatam and Vedic rituals were performed to Sri Kalyana Venkataramana Swamy along with Sridevi and Bhudevi. Special pujas were offered to the Garuda flag before hoisting it atop the Dwajasthambam, inviting all deities for the annual festivities.
In the evening, the deity will bless devotees on Pedda Sesha Vahanam.
The temple premises and Mada streets have been decorated with electrical illumination and floral arrangements. Shelters, queue lines and barricades have been arranged for devotees’ convenience.
Vahana Sevas will be conducted daily from 8.00 am to 11.00 am and 7.00 pm to 9.00 pm.
The programmes were attended by temple officials, archakas and devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి,2026,ఫిబ్రవరి 24: అన్నమయ్య జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 9.50 గం.ల నుండి 10.45 గం.ల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటరమణ స్వామి వారిని ముందుగా ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో మేల్కొలిపి, తదుపరి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 09.50 నుండి 10.45 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి 07.00 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24.02.2026
రాత్రి – పెద్దశేషవాహనం
25.02.2026
ఉదయం – చిన్నశేషవాహనం
రాత్రి – హంస వాహనం
26.02.2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
27.02.2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంత వాహనం
28.02.2026
ఉదయం – మోహినీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం
01.03.2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభవాహనం
02.03.2026
ఉదయం – కల్యాణోత్సవం (ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు)
రాత్రి – గజ వాహనం
03.03.2026
చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 09.00 గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు ఆలయం మూత,
రాత్రి 8.30 గం.ల నుండి అశ్వ వాహనం
04.03.2026
ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గం.లకు )
మధ్యాహ్నం – 12.45 గం.ల నుండి 02.00 గం.ల వరకు మిధున లగ్నంలో చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
05.03.2026
ఉదయం 10 గంటలకు తిరుప్పావడ సేవ, రాత్రి 7.30 గంటలకు శయనోత్సవం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



