GAJA DHWAJA HOISTED _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 నవంబరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.
ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.
టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ స్వామి, కంకణ భట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.
ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం :
ఈ సందర్భంగా ఈవో శ్రీ జె. శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ, గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.
శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు.
ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డిఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా ఆరు గొడుగులను ఈవోకు అందజేశారు.
ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది
NAVAHNIKA KARTHIKA BRAHMOTSAVAMS COMMENCES
Tirupati, 28 November 2024: The holy flag carrying the imprint of the divine elephant was hoisted by the priests he ‘Dhwajapatam’ marking the successful commencement of the Navahnika Karthika Varshika Brahmotsavams of Sri Padmavati Devi at Tiruchanoor temple on Thursday.
TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar, DyEO Sri Govindarajan, Pancharatra Agama Advisor Sri Manikantha Swamy, Kankana Bhattar Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy and others were present.
Later the EO launched Pushpa Pradarshana in Friday Gardens.
Speaking on the occasion he said TTD has made elaborate arrangements to provide darshan as well vahana darshan to the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI