SRI KALYANA VENKATESWARA SWAMY BRAHMOTSAVAM BEGINS _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirupati, 18 February 2025: The annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram began with the Dhwajarohana Ghattam in the auspicious Meenalagnam between 8.15 am to 8.40 am on Tuesday.
The program was conducted as per agama amidst the chanting of Vedic mantras, and Govinda namas by devotees.
Earlier, Swamivari Tiruchi Utsavam was held from 6.30 am to 8.15 am.
Afterwards, the temple priests performed Vishvaksena Aradhana, Vastuhoma, Garuda Lingahoma, Garuda Pratishtha and Raksha bandhanam.
In the presence of Sridevi, Bhudevi and Sri Kalyana Venkateswara Swamy Dhwajarohanam held.
This religious program was conducted under the guidance of the Kankanabattar Sri Narayanacharyalu.
Speaking to the media, JEO Sri V. Veerabraham said that the Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy has started with the sacred Garuda flag hoisting ceremony. The annual festival in the temple will be observed from February 18 to 26 in a grand manner. Extensive arrangements have been made for the devotees who come for Brahmotsavams, he added.
He said that Tirumala Srivari Laddu Prasadam has been made available to the devotees in Srinivasa Mangapuram.
He said that as part of Brahmotsavam, Garudaseva will be held on February 22, Swarnar Rathotsavam on February 23, Rathotsavam on February 25 and Chakrasnanam on February 26. :
The JEO inaugurated the media centre set up next to the Vahana Mandapam under the auspices of the Public Relations Department of TTD.
On Tuesday night between 7pm and 8 pm, Pedda Sesha Vahana Seva will take place in the four mada streets of the temple.
Special Officer of the temple and CPRO Dr T. Ravi, Special Grade Deputy EO Smt. Varalakshmi, Vaikhanasa Agama Advisor Sri. Mohana Rangacharyulu, AEO Sri Gopinath, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri. Munikumar, Sri. Dhana Shekhar, Temple Priests Sri. Balaji Rangacharya, other officials and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
– బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్ శ్రీ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం
జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీనివాసమంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 22న గరుడసేవ, ఫిబ్రవరి 23న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం, ఫిబ్రవరి 26న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
మీడియా సెంటర్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జేఈవో :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో జేఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.